News April 7, 2024
NLG: చికెన్ ధరలు కొండెక్కాయి…!

ఉమ్మడి జిల్లాలో చికెన్ ధరలు కొండెక్కాయి. ముక్కలేనిదే ముద్ద ముట్టని చికెన్ ప్రియులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతోంది. పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. వారం క్రితం రూ.200 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ. 100 పెరిగి రూ.300కు చేరుకుంది. దీంతో చాలా మంది చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు.
Similar News
News September 10, 2025
NLG: ఏటేటా తగ్గుతున్న కూరగాయల సాగు

జిల్లాలో కూరగాయల సాగు ఏటేటా తగ్గుముఖం పడుతోంది. ఎక్కువ శాతం MNGD, DVK, సాగర్, NKL నియోజకవర్గాల్లో కూరగాయల సాగు ఎక్కువగా చేపడుతున్నారు. సాగు గిట్టుబాటుకాకపోవడం, ప్రభుత్వం రాయితీలు కల్పించకపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, దళారులు రంగప్రవేశం చేయడం వంటి కారణాలతో రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదేళ్ల క్రితం 42 వేల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. ప్రస్తుతం 80 శాతం సాగు పడిపోయింది.
News September 10, 2025
NLG: ఒక పోలింగ్ కేంద్రం పెరిగింది.!

MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాలను ఫైనల్ చేశారు. ఈ నెల 6న ముసాయిదా ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రకటించారు. జిల్లాలో 10,73,506 మంది ఓటర్లు, 33 ZPTC, 353 MPTC నియోజకవర్గాల పరిధిలో 1,956 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లుగా ముసాయిదా జాబితాలో ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పు లేదు కానీ ఒక పోలింగ్ కేంద్రం పెరిగినట్లు జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
News September 10, 2025
NLG: డ్రైవర్ల కొరతే ఆర్టీసీకి పెద్ద సమస్య..!

డ్రైవర్ల కొరతతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కని పరిస్థితి నెలకొంది. నల్గొండ, సూర్యాపేట డిపోలకు మొత్తం 156 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. జీతాలు తక్కువగా ఉండడంతో పాటు.. డీలక్స్ బస్సుల డ్రైవర్లకు రోజుకు రూ.30 వేల టార్గెట్లు ఇవ్వడంతో డ్రైవర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్టీసీకి డ్రైవర్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. టార్గెట్లతో తమపై ఒత్తిడి పెరుగుతుందని డ్రైవర్లు అంటున్నారు.