News September 21, 2025

NLG: చిన్నారులు మృతి.. కీలక ఆదేశాలు

image

నల్గొండ జిల్లాలో ప్రమాదాల నివారణకు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. ఇటీవల నల్గొండ జిల్లాలో స్కూల్ బస్సుల కింద పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో 360 డిగ్రీలు కనిపించేలా అద్దాలు బిగించుకోవాలని రవాణా శాఖ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. నెల రోజుల్లో మిర్రర్లు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి ఆదేశించారు.

Similar News

News September 21, 2025

NLG: కానుక.. దసరా తర్వాతే..?

image

మహిళలు ఎంతో సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం షాకిచ్చింది. ఉచిత చీరలు పంపిణీ చేస్తారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. అక్టోబర్ తర్వాత చీరలు వస్తాయని, స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు మాత్రమే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అవి కూడా ఒకే కలర్ (డ్రెస్ కోడ్)లో ఉంటాయని తెలిసింది. జిల్లాలో 3,66,532 మంది SHG సభ్యులు ఉన్నారు.

News September 21, 2025

NLG: మైనార్టీల సంక్షేమ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మైనార్టీల ఆర్థిక సహాయం కోసం ప్రవేశపెట్టిన ‘రేవంత్ అన్నకా సహారా మిస్కీనో కే లియే’, ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి తెలిపారు. అర్హులు https://tgobmms. cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

News September 20, 2025

NLG: దరఖాస్తుల ఆహ్వానం.. ఈనెల 30 లాస్ట్

image

2025-26 ఆర్ధిక సంవత్సరమునకు గాను స్వచ్చంద సంస్థలు/ ప్రభుత్వేతర సంస్థలు.. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు, మానసిక వికలాంగుల ఆశ్రమాలు మొదలగు సంస్థలలకు ఆర్థిక సహాయం అందించుటకు గాను అర్హత గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా పరిధిలోని, రిజిస్టర్డ్ స్వచ్చంద సంస్థలు/ప్రభుత్వేతర సంస్థలు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.