News May 25, 2024
NLG: చివర దశకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

WGL-KMM-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పోలింగ్ ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. ఏడుగురు మంత్రులు ఈ నియోజకవర్గంలో ఉండగా.. కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. బీజేపీ ఈ స్థానంలో బోణీ కొట్టాలని చూస్తోంది.
Similar News
News February 20, 2026
నల్గొండలో చెరువుల నవీకరణకు మోక్షం!

పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్ 2.0’ పథకం జిల్లాలో వేగవంతం కానుంది. ఈ పథకం కింద ఎంపిక చేసిన చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో, పనులు ప్రారంభించేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని తొమ్మిది చెరువులను తొలిదశలో ఎంపిక చేసి, వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.22.35 కోట్లను కేటాయించింది.
News February 20, 2026
NLG: హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతి!

జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో దస్రూ నాయక్ తెలిపారు. పరీక్షల సరళిపై ఇప్పటికే అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 27,905 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆన్‌లైన్ హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారని తెలిపారు.
News February 20, 2026
నల్గొండ: రైతులు ఖాతాల్లో ‘సన్నాల’ బోనస్ రూ.71.47 కోట్లు జమ

వానాకాలం సీజన్‌లో సన్న రకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం బోనస్ నగదు విడుదల చేసింది. జిల్లాలోని 31,416 మంది రైతుల ఖాతాల్లో రూ.71.47 కోట్లను నేరుగా జమ చేసింది. ఇప్పటికే ధాన్యం విలువ కింద రూ.355.18 కోట్లు చెల్లించగా, తాజా బోనస్‌తో రైతులకు అదనపు లబ్ధి చేకూరింది. ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


