News February 3, 2025

NLG: చేనేత కళాకారుల జీవన విధానంపై సినిమా

image

పోచంపల్లి చేనేత కళాకారుల జీవన విధానంపై ఓ సినిమా రూపొందుతోంది. చౌటుప్పల్‌కి చెందిన వ్యాపారవేత్త ధనుంజయ నిర్మాతగా, పోచంపల్లికి చెందిన బడుగు విజయకుమార్ దర్శకత్వంలో ది అవార్డ్ 1996 అనే సినిమా తీస్తున్నారు. నిర్మాత సురేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసినట్లు ధనుంజయ తెలిపారు. ఈ సినిమా మొత్తం గ్రామాల్లో చేనేత కళాకారుల జీవన విధానం, వారు దళారుల చేతిలో ఎలా మోసపోతున్నారో తెలిపే విధంగా ఉంటుందన్నారు.

Similar News

News February 21, 2026

నల్గొండ: పాఠశాలల్లో కంప్యూటర్ల రిపేర్లకు కోటేషన్ల ఆహ్వానం!

image

జిల్లాలోని 200 ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల మరమ్మతుల కోసం సమగ్ర శిక్షా విభాగం కోటేషన్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 23 నుంచి మార్చి 2వరకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. మార్చి 3న కలెక్టరేట్‌లో ఈ కోటేషన్లను తెరుస్తారని ఆయన పేర్కొన్నారు.

News February 21, 2026

నల్గొండలో 24న మినీ జాబ్ మేళా

image

నల్గొండలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్. పద్మ తెలిపారు. ఐటీఐ క్యాంపస్‌లోని ఉపాధి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఇతర వివరాలకు 7893420435 నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.

News February 21, 2026

నల్గొండ: నేతన్నలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

2026 జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నారు. 30 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల అనుభవం ఉన్న చేనేత కళాకారులు; 25 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. ఆసక్తి గలవారు మార్చి 31, 2026 లోపు జిల్లా చేనేత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.