News October 4, 2025
NLG: జడ్పీ పీఠంపై కాంగ్రెస్ కసరత్తు!

NLG జడ్పీ ఛైర్మన్ ఈసారి ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని 33 ZPTC స్థానాల్లో ST మహిళలకు పెద్దవూర, డిండి స్థానాలు రిజర్వు కాగా, DVK, పీఏపల్లి, కొండమల్లేపల్లి స్థానాలు ST జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. ఈ 5 స్థానాలతో పాటు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించిన స్థానాల్లోనూ ST మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు తీవ్ర పోటీ నెలకొంది.
Similar News
News October 29, 2025
నల్గొండ: మొంథా తుఫాన్.. జిల్లా యంత్రాంగం అప్రమత్తం

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలిచ్చారు. అధికారులు విధి నిర్వహణలో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. అంగన్‌వాడీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. రహదారులు, విద్యుత్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, కంట్రోల్ రూమ్‌కు 18004251442 సమాచారం అందించాలని తెలిపారు.
News October 29, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిల్లావ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. పాత ఇండ్లలో ఎవరో ఉండకూడదని సూచించారు.
News October 29, 2025
నల్గొండ: గౌడన్నా జర భద్రం!

నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, గౌడ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. తడిసిన చెట్ల కాండాలు జారే ప్రమాదం ఉందని, ఇది ప్రాణాలకే ముప్పు తెస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా చెట్టుపై పట్టు దొరకకపోవచ్చని, తుఫాను తగ్గేంత వరకు గీత వృత్తికి విరామం ఇవ్వాలని కోరుతున్నారు.


