News August 26, 2025
NLG: జిల్లాలో పదోన్నతుల కోలాహలం

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల కోలాహలం కొనసాగుతుంది. 2024లో కూడా ప్రభుత్వం పదోన్నతులను ఆన్లైన్లో చేపట్టినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు స్పౌజ్, హెల్త్ వంటి అంశాలపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల జిల్లాలో 37 SAలకు జిహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. తాజాగా SGTలకు LFL హెచ్ఎంలుగా, SAలుగా168 మందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News August 26, 2025
NLG: ఇక నోటిఫికేషనే తరువాయి..!

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు జిల్లాల్లో మూడు జిల్లా ప్రజాపరిషత్లు, 33 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
News August 26, 2025
నల్గొండ: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ఖరీదైన కార్లలో రాత్రి వేళల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాలను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నాలుగు ముఠాలకు చెందిన 16 మంది సభ్యులను అరెస్టు చేశామని, వారు మొత్తం 26 నేరాలలో 200లకు పైగా మేకలను దొంగిలించారని ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుండి రూ.2.46 లక్షల నగదు, రూ.2.75 లక్షల విలువైన 22 గొర్రెలు, రూ.47 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News August 26, 2025
నల్గొండ: విషాదం.. వాహనం ఢీకొని చిన్నారి మృతి

కొండమల్లేపల్లి మండలంలో జాతీయ రహదారిపై విషాదం జరిగింది. బొలెరో వాహనం ఢీకొని బాలిక మృతిచెందింది. కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై బాపూజీ నగర్ వద్ద రోడ్డు దాటుతున్న బాలిక అక్షరను వాహనం ఢీకొట్టడంతో చనిపోయిందని స్థానికులు తెలిపారు. బాపూజీనగర్‌కి చెందిన పిట్ల రాజా-సంధ్య కూతురు అక్షర మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.