News July 1, 2024

NLG: జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

image

నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం షురూ కాకముందే  డెంగీ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడం డెంగీ వ్యాప్తి ఉధృతికి అద్దం పడుతోంది. నల్గొండ నియోజకవర్గంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News July 3, 2024

కొత్త చట్టాలతో బాధితులకు న్యాయం

image

దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వెల్లడించారు. తొలి రోజు కొత్త చట్టాల కింద జిల్లాలో ఏడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదయ్యాయని తెలిపారు. బాధితుడు ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్‌ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

News July 3, 2024

NLG: రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

image

ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాలలో బుధ, గురువారాలు రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఈ విషయమై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశించారు.

News July 2, 2024

మంత్రి కోమటిరెడ్డికి కంచర్ల కౌంటర్

image

<<13545889>>మంత్రి కోమటిరెడ్డికి <<>>మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండలో రూ.100 కోట్లు పలికే భూమి ఉందా అని ఆయన ప్రశ్నించారు. మిగతా పార్టీ ఆఫీసులకు భూమి కేటాయించినట్లే బీఆర్ఎస్‌కి భూ కేటాయింపు జరిగిందన్నారు. పార్టీ ఆఫీసుకు సీసీఎల్‌ఏ అనుమతులు కూడా వచ్చాయన్నారు. నిబంధనల ప్రకారం డబ్బు కూడా చెల్లించామన్నారు.