News June 24, 2024

NLG: జిల్లాలో మందకొడిగా సాగు పనులు

image

జిల్లాలో వానాకాలం సాగు పనులు మందకొడిగా సాగుతున్నాయి. సీజన్ ఆరంభమై మృగశిర కార్తెలో పోయి ఆరుద్ర కార్తె వచ్చినప్పటికీ సాగు పనులు ఊపందుకోలేదు. సరైన వర్షాలు కురవకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సాగు పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ప్రస్తుత వానాకాలంలో మొత్తం 11.40లక్షల ఎకరాల్లో పత్తి, వరి, వేరుశనగ, కంది, పెసర, ఇతర పంటలను రైతులు సాగు చేయనున్నట్టు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

Similar News

News February 8, 2026

నల్లగొండ: మున్సిపల్ ఎన్నికలు.. 11న స్థానిక సెలవు!

image

నల్లగొండ జిల్లాలో ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ చంద్రశేఖర్ స్థానిక సెలవు ప్రకటించారు. నల్లగొండ కార్పొరేషన్ సహా జిల్లాలోని మిర్యాలగూడ, హాలియా, చండూరు, చిట్యాల పురపాలక సంఘాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుంది. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News February 8, 2026

NLG: ఓట్ల లెక్కింపునకు వేదిక ఖరారు.. 3 రోజులు సెలవు!

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం నిడమనూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కౌంటింగ్ కేంద్రంగా అధికారులు ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ పాఠశాలకు ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు స్థానిక సెలవులను ప్రకటించారు. లెక్కింపు ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రిన్సిపాల్ తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

News February 8, 2026

NLG: గల్లంతైన వ్యక్తి కోసం NDRF గాలింపు!

image

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో కారు పడి గల్లంతైన పుల్లయ్య కోసం NDRF బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. నిన్న జరిగిన ప్రమాదంలో భార్య పద్మ మృతదేహం లభించగా, భర్త జాడ తెలియక పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనను ప్రమాదమా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అతడిని విచారిస్తున్నారు.