News April 7, 2024
NLG: జేబు దొంగల్లా కాంగ్రెస్ దుర్మార్గపు పాలన: MLA

ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. మంత్రులకు IPL చూడటానికి ఉన్న ప్రాధాన్యం.. రైతులపై లేదని అన్నారు. జేబు దొంగల్లా కాంగ్రెస్ దుర్మార్గపు పాలన ఉందన్నారు.
Similar News
News April 25, 2025
నల్గొండ: కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు.
News April 25, 2025
మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు: DIEO

ఇంటర్ ఫెయిలైన, ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే విద్యార్థులకు మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి దస్రూ నాయక్ తెలిపారు. రోజూ 2 పూటల పరీక్ష ఉంటుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. అయితే అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.
News April 25, 2025
NLG: ఒకే తరహా ఘటనలు.. చర్యల్లో వివక్ష!

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ఘటనల్లో అధికారులు చర్యలు తీసుకోవడంలో వివక్ష చూపుతున్నట్లు తెలుస్తుందని పలువురు అంటున్నారు. KTR (మం) చెరువుఅన్నారంలో 6.18 గుంటల భూమిని DT సుకన్య ఇతరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంలో సుకన్యను కలెక్టరేట్‌కు అటాచ్ చేశారే తప్ప చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. HZNRలో పట్టా మార్పిడి విషయంలో మాత్రం తహశీల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.