News January 5, 2026
NLG: టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు

టెట్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇబ్బందిగా మారింది. మొదటి రోజే అప్లై చేసినా, ప్రాధాన్యత క్రమంలోని చివరి పట్టణాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. జిల్లా నుంచి 1,557 మంది ఉపాధ్యాయులతో సహా సుమారు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Similar News
News January 6, 2026
NLG: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

కారు, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం చిలకమర్రి వద్ద KDD-జడ్చర్ల రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతుడు పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాలకి చెందిన మారుపాక గణేష్‌గా గుర్తించారు. గణేష్ అంగడిపేట ఎక్స్ రోడ్డులోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 6, 2026
NLG: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్

ట్రాన్స్‌జెండర్ల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘ఉపాధి పునరావాస పథకాన్ని’ ప్రవేశపెట్టిందని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి తెలిపారు. వ్యవసాయం, వ్యాపారం లేదా సేవా రంగాల్లో స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అర్హులైన వారు ఈ నెల 12వ తేదీలోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదమైన జీవనం గడపవచ్చన్నారు.
News January 6, 2026
NLG: పురపోరు.. చిత్ర విచిత్రాలన్నో

నల్లగొండ మున్సిపాలిటీ అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. పట్టణం నడిబొడ్డున ఉన్న వార్డుల్లో సైతం ఓటర్ల పేర్లు భారీ సంఖ్యలో గల్లంతయ్యాయి. ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డులోకి చేర్చారు. భౌగోళికంగా ఒక వార్డు మధ్యలోని కాలనీ ఓటర్లను ఆ వార్డు సరిహద్దును దాటి మరో వార్డులోకి మార్చారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో వందల ఓట్లు పక్క వార్డుల్లో కలిపారు.


