News April 22, 2024

NLG: టెట్ పరీక్షకు 27, 491 మంది దరఖాస్తు

image

టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్‌కు ఉమ్మడి జిల్లా నుంచి 27,491 మంది దరఖాస్తు చేశారు. పేపర్-1 విభాగంలో మొత్తం 8,130 మంది, పేపర్-2లో 19,361 మంది దరఖాస్తు చేశారు. NLG జిల్లాలో పేపర్-1లో 3,954 మంది, పేపర్-2లో 9,162 మంది దరఖాస్తు చేశారు. SRPT జిల్లాలో పేపర్-1లో 3,242 మంది, పేపర్-2లో 5,767 మంది దరఖాస్తు చేసుకోగా, యాదాద్రి-BNG జిల్లాలో పేపర్-1లో 934 మంది, పేపర్- 2లో 4,492 మంది దరఖాస్తు చేశారు.

Similar News

News April 5, 2026

NLG: ఫ్రిడ్జ్‌ పేలకూడదంటే.. ఈ జాగ్రత్తలు మరువొద్దు

image

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రిఫ్రిజిరేటర్లు పేలుతున్న <<19570386>>ఘటన<<>>లు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని నివారించాలంటే ఫ్రిడ్జ్‌ను గోడకు ఆనించకుండా గాలి ఆడేలా కనీసం అడుగు దూరం ఉంచాలి. దీనివల్ల కంప్రెసర్ వేడి బయటకు పోతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణకు నాణ్యమైన స్టెబిలైజర్ వాడాలి. ఫ్రిడ్జ్‌లో పరిమితికి మించి వస్తువులను కుక్కకూడదు. ఇబ్బందులుంటే మెకానిక్‌తో తనిఖీ చేయిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.

News April 5, 2026

NLG: ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలి

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్‌రెడ్డి ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.