News April 2, 2025
NLG: ట్యాంకర్లతో పంట రక్షణ

జిల్లాలో వరి చేలు చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపొతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తగా బోర్లు వేస్తుండగా మరికొంత మంది గ్రామాల్లోని ట్యాంకర్ల ద్వారా నీటి తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు అందిస్తుండడంతో ట్యాంకర్ల యజమానులకు ఉపాధి లభిస్తోంది. వీరు ఒక్క ట్యాంకర్‌కు రూ.1000 వరకు తీసుకుంటున్నారని తెలిపారు.
Similar News
News April 3, 2025
NLG: 7 నుంచి పదో తరగతి పరీక్షల మూల్యాంకనం

పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 2న సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. బుధవారం జరిగిన పరీక్షకు మొత్తం 18,666 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 18,628 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. 99.79 శాతం హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం జరగనున్నది.
News April 3, 2025
NLG: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ITI, డిప్లొమా, NCC కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic. వెబ్‌సైట్‌లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
News April 3, 2025
మూసీకి పూడిక ముప్పు..!

మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. సీడబ్లూసీ గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగు నీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించింది. పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికి చేరుకుంది.