News December 28, 2024
NLG: డిగ్రీ విద్యార్థులకు ఇదే చివరి అవకాశం!
MG యూనివర్సిటీ పరిధిలోని వార్షిక, సెమిస్టర్ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు చివరి అవకాశం కల్పిస్తూ పరీక్షలను నిర్వహించనున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2011-2016 వరకు విద్య వార్షిక సంవత్సరాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు పరీక్ష ఫీజును 12 ఫిబ్రవరి 2025 వరకు లోపు చెల్లించి పరీక్షకు హాజరు కావాలని తెలిపారు.
Similar News
News December 29, 2024
భువనగిరి: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
గుండెపోటుతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. భువనగిరికి చెందిన దోసపాటి బాలరాజు (35) హైదరాబాద్ మొదటి బెటాలియన్ యూసఫ్‌గూడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించగా ఆస్పత్రికి తరలిస్తుండటంతో మార్గ మధ్యలో చనిపోయారు. బాలరాజు మృతితో బెటాలియన్‌లో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News December 29, 2024
NLG: న్యూ ఇయర్ వేడుకలకు ప్లాన్స్
న్యూ ఇయర్ వేడుకలకు నల్గొండ జిల్లాలో యువత సిద్ధమవుతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. జిల్లా HYDకు సరిహద్దు కలిగిఉండడం, శివార్లలో ఎక్కువగా ఫాంహౌస్‌లు, రిసార్ట్స్ ఉండడంతో అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో బొమ్మలరామారం, బీబీనగర్ మండలాల్లో ఫాంహౌసులు ఉన్నాయి.
News December 28, 2024
NLG: నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిఘానీడలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన ప్రతిపాదనలను వెంటనే బోర్డుకు పంపాలని ఈ నెల 23న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 290 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలో ఫిబ్రవరి మొదటివారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి.