News April 4, 2025
NLG: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

నల్గొండ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.
Similar News
News February 28, 2026
NLG: ఇంటర్ పరీక్షలు.. నాలుగో రోజు 281 మంది గైర్హాజరు

జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 281 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 11,050, మంది విద్యార్థులకు గాను 10, 839మంది హాజరుకాగా, 211 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,884 మంది విద్యార్థులకు గాను 1,814 మంది హాజరుకాగా, 70 మంది గైర్హాజరయ్యారు.
News February 28, 2026
నల్గొండ: మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ

జిల్లా మహిళా ప్రాంగణంలో ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ప్రారంభం కానున్నట్లు మేనేజర్ అనిత తెలిపారు. 18-35 ఏళ్లలోపు వయస్సు ఉండి, కనీసం 8వ తరగతి చదివిన మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు రెండు ఫోటోలు, ఆధార్ కార్డుతో కార్యాలయంలో సంప్రదించాలి. ఒంటరి మహిళలు, వికలాంగులకు ప్రాధాన్యత ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
News February 28, 2026
నల్లగొండ: 28న జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాల్లో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీపడదగ్గ క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ వివాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, భూ తగాదాలు వంటి పెండింగ్ కేసులను ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల కక్షిదారులకు సత్వర న్యాయంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ తెలిపారు. అప్పీలుకు తావులేని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


