News October 15, 2024

NLG: తప్పుడు FIR.. ఎస్ఐ సస్పెండ్ 

image

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ముల్కలపల్లిలో ఇటీవల ఓ మహిళ హత్య జరిగింది. ఈ కేసు విచారణలో ఎస్ఐ వి.నారాయణరెడ్డి నిర్లక్ష్యం వహించడంతో పాటు నిందితులను తప్పించేందుకు తప్పుడు FIR, వివరాలు నమోదు చేయించి, రూ.లక్ష లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేయగా నిజమని తేలడంతో ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఓ సీఐ, కానిస్టేబుల్‌పై విచారణ సాగుతోంది.

Similar News

News October 15, 2024

NLG: మూసీకి తగ్గిన వరద.. గేట్లు మూసివేత

image

మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. HYD నగరంతోపాటు, మూసీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టుకు సోమవారం కేవలం 994 క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. 645 అడుగుల గరిష్ఠ నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో సాయంత్రం వరకు నీటిమట్టం 644.50 అడుగులు ఉంది.

News October 15, 2024

NLG: నేడు కొత్త టీచర్లకు పోస్టింగ్..!

image

డీఎస్సీ 2024 ఫలితాల్లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు మంగళవారం పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే వారు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ జిరాక్స్, జాయినింగ్ లెటర్ సమర్పించారు. 535 మంది నూతన ఉపాధ్యాయులు మెరిట్ (ర్యాంకుల) ఆధారంగా ఖాళీల పోస్టులను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించి తాము ఎంపిక చేసుకున్న పాఠశాలకు పోస్టింగ్ ఇస్తారు.

News October 15, 2024

నకిరేకల్-నాగార్జున సాగర్ హైవేకు నిధుల విడుదల

image

నల్గొండ జిల్లా అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ చేసింది. నకిరేకల్-నాగార్జున సాగర్ మధ్య హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 14 కి.మీ. మేర 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.516 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. గుంటూరు-నల్లపాడు మధ్య రూ.98 కోట్లతో 4 లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.