News March 5, 2025
NLG: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన.!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కుల గణన అంశంలో తన పాత్రలేదని, గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం తనదన్నారు. తీన్మార్ మల్లన్న ఏ ప్రెస్ మీట్స్ పెట్టుకుంటే.. తనకేంటని జానారెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సలహాలు అడిగితే ఇస్తానన్నారు. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
Similar News
News November 14, 2025
రామగుండం: ఖాళీ ప్లాట్ల ఓనర్లకు అదనపు కలెక్టర్ వార్నింగ్

రామగుండం మున్సిపల్ పరిధిలో ఖాళీ ప్లాట్లు పిచ్చిచెట్లతో పెరిగి, మురుగు నీరు నిలిచి దోమలు- పందుల పెరుగుదలకు కారణమవుతున్నాయని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ అన్నారు. ఇలాంటి స్థలాలను గుర్తించి యాజమానులకు నోటీసులు జారీ చేస్తున్నామని, నోటీసు వచ్చిన వారం రోజుల్లో శుభ్రపరచని పక్షంలో మున్సిపాలిటీల చట్టం- 2019 ప్రకారం ఓనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: 56 మంది డిపాజిట్ గల్లంతు!

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS మధ్యే పోరు నడిచింది. కాగా మొత్తం 58 మంది ఈ ఎన్నికలో పోటీ చేయగా నవీన్ యాదవ్, మాగంటి సునీత మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. ఇందులో నవీన్ యాదవ్ గెలుపొందగా సునీత రెండో స్థానంలో నిలిచారు. BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సహా 56 మంది డిపాజిట్ గల్లంతైంది. చిన్న పార్టీలు, స్వతంత్రుల్లో ఒక్కరికి కూడా 250 ఓట్లు దాటలేదు.