News April 10, 2025

NLG: త్వరలో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు

image

NLG రీజియన్‌కు ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయి. తొలిసారి కాలుష్య రహిత సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌లు రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ మార్పులు చేస్తూ ప్రయాణికులను పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇంధనం ఖర్చు తగ్గించుకుని ఈ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. NLG రీజియన్‌కు 152 బస్సులను కేటాయించారు.

Similar News

News April 17, 2025

NLG: వానాకాలం సాగు అంచనా 11.60 లక్షల ఎకరాలు!

image

వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. దీనికి అవసరమైన ఎరువులు, విత్తనాల ప్రతిపాదనలు కూడా ఖరారు చేసిన వ్యవసాయ శాఖ.. కమిషనరేట్‌కు పంపించింది. గత వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటల సాగు కాగా ప్రస్తుత వానాకాలంలో అదనంగా సుమారు 10 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసింది. ప్రస్తుత వానాకాలంలో 11,60,389 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు ప్రణాళిక ఖరారు చేసింది.

News April 17, 2025

NLG: వివాహితపై హత్యాయత్నం.. 20 ఏళ్లు జైలు

image

వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ NLG జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి(M) దామెర వాసి మహేశ్ గిరిజన మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తూ 2018లో ఆమెపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఆమె నాంపల్లి PSలో ఫిర్యాదు చేయగా అప్పటి SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జి రోజారమణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

News April 17, 2025

NLG: ఉద్యోగాలు.. APPLY NOW

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి పద్మ తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!