News August 21, 2025
NLG: దెబ్బతిన్న రోడ్లపై మంత్రి సమీక్ష

హ్యామ్ రోడ్లు, నేషనల్ హైవేలకు సంబంధించిన అంశాలతోపాటు, ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో కోమటిరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఈఎన్‌సీ జయభారతి, సీఈ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 21, 2025
చైనాను నమ్మొచ్చా?

అమెరికా టారిఫ్స్‌కు వ్యతిరేకంగా <<17476240>>భారత్-చైనా<<>> దగ్గరవుతున్నాయి. తమ దేశంలో వస్తువులను అమ్ముకోవచ్చని చైనా ఆహ్వానించింది. అయితే చైనాను అంత తేలిగ్గా నమ్మవద్దని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. అమెరికాను దాటి ప్రపంచ నం.1 అయ్యేందుకు చైనా ఏమైనా చేస్తుందని, ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ పాక్‌కు సపోర్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. అయితే చైనాతో సఖ్యతతో ఉంటూనే USను దూరం చేసుకోవద్దంటున్నారు. దీనిపై మీ COMMENT?
News August 21, 2025
సామరస్యంగా నవరాత్రులు నిర్వహించాలి: యాదాద్రి కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణేశ్ నవరాత్రుల ఏర్పాట్ల కోసం ఈరోజు కలెక్టర్ హనుమంతరావు సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, కమిటీ సభ్యులతో గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. గతంలో కంటే వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని, శాంతియుతంగా, సామరస్యంగా నవరాత్రులు నిర్వహించాలని కోరారు.
News August 21, 2025
నల్గొండ: ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీ

సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్నపిల్లలకు సత్వర చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులను ఈరోజు ఆదేశించారు. అంతేకాక ఆయా వ్యాధులకు సంబంధించి వ్యాధి నివారణ మందులు ముందే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గురువారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి చిన్న పిల్లల వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న మందులు, ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.