News November 26, 2025
NLG: నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

* డీసీసీ పీఠంపై రగడ.. కోమటిరెడ్డి లేఖతో పొలిటికల్ హీట్
* చెరువుగట్టులో స్వచ్ఛత.. పరిశుభ్రత
* నల్గొండలో బూజు పట్టిన బ్రెడ్లు విక్రయం
* దర్వేశిపురం ఎల్లమ్మ ఆలయానికి పెరిగిన ఆదాయం
* కార్యకర్త మృతి.. పాడె మోసిన బీఎల్ఆర్
* నార్కట్‌పల్లిలో రాస్తారోకో
* నిడమనూరులో రోడ్లే కల్లాలు
Similar News
News February 13, 2026
నల్గొండ: ‘ప్రజావాణి’ ప్రారంభం

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియడంతో నిలిచిపోయిన ‘ప్రజావాణి’ కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. ఈ సోమవారం నుంచి కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలను యథావిధిగా స్వీకరిస్తామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 13, 2026
ఎంజీయూ B.Ed ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఎంజీయూ పరిధిలోని B.Ed సెమిస్టర్-3 రెగ్యులర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షల కోసం ఎగ్జామినర్ల జాబితాను యూనివర్సిటీ ప్రకటించింది. ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-A కాలేజీలకు, 19, 20 తేదీల్లో గ్రూప్-B కాలేజీలకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.
News February 13, 2026
నల్గొండలో విషాదం.. డీసీఎం ఢీకొని కానిస్టేబుల్ మృతి

చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనపల్లి సమీపంలో వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో మునుగోడు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ (34) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల విధులను ముగించుకుని నకిరేకల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి బైక్ నుజ్జునుజ్జయింది.


