News April 10, 2024
NLG: నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. బుధవారం ఉదయం సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 510.30 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 132.8618 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక గత సంవత్సరం ఇదే సమయంలో 528.00 అడుగులు, 164.2680 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ లో 6,846 క్యూసెక్కులు ఉంది.
Similar News
News July 10, 2025
NLG: ముందస్తుకు మురిసి.. ఇప్పుడేమో దిగులు!

ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్ణాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు నారు పోసుకున్నారు.
News July 10, 2025
NLG: ‘ఎంపీడీవోలు పనితీరును మెరుగు పరచుకోవాలి’

అన్ని ప్రభుత్వ పథకాలలో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధులు పెరగకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదేనని అన్నారు.
News July 10, 2025
NLG: మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు

ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఎఫ్ఏలు, టీఏలు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.