News November 13, 2025
NLG: నిర్దిష్ట లక్ష్యంతోనే పనులు: DRDO

జిల్లాలో చేపట్టిన జల్ సంచయ్, జల్ భాగీదారి కార్యక్రమం చేపట్టిన పనులకు కేంద్ర జలశక్తి శాఖ పురస్కారం ప్రకటించడం సంతోషంగా ఉందని DRDO పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనలతో తాము ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఈ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేశామన్నారు. నీటి వనరుల కొరత ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని సంరక్షించడంతో పాటుగా, భూగర్భజలాలు పెంచడమే కేంద్రంగా ఈ పనులు గుర్తించి నిర్వహించామన్నారు.
Similar News
News November 13, 2025
ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి దాడి చేశారు: FRO

చందంపేట మండలం గువ్వలగుట్ట తండాలో నిన్న జరిగిన దాడిపై ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. అటవీ భూమిలో సాగు చేస్తున్న గిరిజనులను హక్కు పత్రాలు చూపాలని కోరామన్నారు. కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని వాగ్వాదానికి దిగి ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి రాళ్ళు, కర్రలతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు.
News November 13, 2025
NLG: ఇప్పుడే ఇలా.. చలితో కష్టమే..!

నల్గొండ జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు పగలు, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఒక్కసారిగా వాతావరణం మారడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబరు మొదట్లోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పడిపోతున్నాయి. మరోవైపు రోగులతో దవాఖానాలతో కిటకిటలాడుతున్నాయి.
News November 13, 2025
కట్టంగూర్: వెయ్యి కొట్టు.. ఫ్లాట్ పట్టు

ఆపదలో అక్కరపడతాయని కొనుగోలు చేసిన స్థిరాస్తులను అమ్మేందుకు యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు లక్కీ డ్రా పేరుతో ప్లాట్లను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టంగూర్కు చెందిన మేకల రమేష్.. ‘వెయ్యి కొట్టు ప్లాటు పట్టు’ అంటూ బ్రోచర్లను సిద్ధం చేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబేడ్కర్ నగర్ కాలనీలో 147 గజాల ప్లాట్ లక్కీ డ్రా తరహాలో బేరానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.


