News May 23, 2024
NLG: నేడు ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష

ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షను గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందు కోసం సూర్యాపేటలో 1, కోదాడలో 2, నల్గొండలో 1 మొత్తం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షకు అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 1100 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్ సెట్ ఛైర్మన్ ఆచార్య గోపాల్రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
కట్టంగూర్: వెయ్యి కొట్టు.. ఫ్లాట్ పట్టు

ఆపదలో అక్కరపడతాయని కొనుగోలు చేసిన స్థిరాస్తులను అమ్మేందుకు యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు లక్కీ డ్రా పేరుతో ప్లాట్లను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టంగూర్‌కు చెందిన మేకల రమేష్.. ‘వెయ్యి కొట్టు ప్లాటు పట్టు’ అంటూ బ్రోచర్లను సిద్ధం చేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబేడ్కర్ నగర్ కాలనీలో 147 గజాల ప్లాట్ లక్కీ డ్రా తరహాలో బేరానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
News November 13, 2025
NLG: ఇందిరమ్మ లబ్ధిదారులకు మరుగుదొడ్లు

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్దిపొందిన వారికి వ్యక్తిగత మరుగుదొడ్లు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 34,023 ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 19,697 ఇండ్లు మంజూరయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వీరికి మరుగుదొడ్లను మంజూరు చేయనున్నారు.
News November 12, 2025
నల్గొండలో సదరం కేంద్రం ప్రారంభించిన మంత్రి

దివ్యాంగుల కోసం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులకు వైకల్య గుర్తింపు కార్డులు సులభంగా, వేగంగా లభించే సదుపాయం కలుగుతుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ముఖ్యమైన ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు.


