News October 15, 2024

NLG: నేడు కొత్త టీచర్లకు పోస్టింగ్..!

image

డీఎస్సీ 2024 ఫలితాల్లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు మంగళవారం పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే వారు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ జిరాక్స్, జాయినింగ్ లెటర్ సమర్పించారు. 535 మంది నూతన ఉపాధ్యాయులు మెరిట్ (ర్యాంకుల) ఆధారంగా ఖాళీల పోస్టులను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించి తాము ఎంపిక చేసుకున్న పాఠశాలకు పోస్టింగ్ ఇస్తారు.

Similar News

News December 25, 2025

నల్గొండ: 31న అర్ధరాత్రి వరకు వైన్స్

image

న్యూ ఇయర్ నేపథ్యంలో DEC 31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వైన్స్ రాత్రి 12 గంటల వరకు, బార్లు ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకునేందుకు వెసులుబాటు కల్పించడంతో యజమానులు భారీ ఏర్పాట్లు చేశారు. లైటింగ్స్‌తో దుకాణాలను ముస్తాబు చేయడంతో పాటు, గిరాకీకి తగ్గట్టుగా అన్ని బ్రాండ్లను సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయి విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.

News December 25, 2025

బ్లాక్ స్పాట్స్ లేకుండా చేస్తాం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

జిల్లాలో ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ తగ్గించామని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. 2023లో రహదారిపై 59 బ్లాక్ స్పాట్స్ ఉండగా, 2025 నాటికి 30కి తగ్గించామన్నారు. జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సం.రం 350-400 వరకు రోడ్డు ప్రమాద మరణాలు ఉండేవని, అలాంటిది ఈ సం.రం 42కు తగ్గాయన్నారు. వచ్చే సం.రం బ్లాక్ స్పాట్స్ లేకుండా చేస్తామన్నారు.

News December 25, 2025

NLG: 2025 రిపోర్ట్.. సైబర్ నేరాలు పెరిగాయి

image

పోలీస్ శాఖ వార్షిక నివేదిక-2025ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ విడుదల చేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం సాధారణ నేరాలు తగ్గాయని ఆయన వెల్లడించారు. అయితే సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. 2024లో 235 సైబర్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 255 సైబర్ నేరాలు నమోదయ్యాయి. లైంగిక వేధింపుల కేసులు 216 నుంచి 196కు తగ్గాయి. పోక్సో చట్టం కింద గతేడాది 121, ఈ ఏడాది 117 కేసులు పైలయ్యాయి.