News May 23, 2024

NLG: నేడు సాగర్‌లో బుద్ధ జయంతి

image

నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో బుద్ధ జయంతి ఉత్సవాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలు నిర్వహించడానికి పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో బుద్ధవనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో బౌద్ధ బిక్షవులతో బుద్ధ పాదుకల వద్ద ప్రత్యేక పూజలతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు బుద్ధవనంలోకి ఉచిత ప్రవేశ సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 1, 2024

NLG: పోలీసుల కనుసన్నల్లోనే కేటీఆర్‌పై దాడి: జగదీశ్ రెడ్డి

image

తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల భాదితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్‌పై దాడి హేయమైన చర్య అన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం దాడి జరిగింది అని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ను ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు అని తెలిపారు.

News October 1, 2024

పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని నల్గొండ,సూర్యాపేట, యాదాద్రి జిల్లావాసులు ఆలోచనలు పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం

image

ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవి కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా ఓటర్ నమోదుకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.