News June 9, 2024

NLG: పక్షం ముందుగానే సాగు పనులు!

image

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ముందుగానే వర్షాలు పడటం, ఈ ఏడాది ఆశాజనకంగానే వర్షాలు ఉంటాయని చెబుతుండటంతో రైతులు పక్షం రోజుల ముందుగానే సాగు పనులు మొదలు పెట్టారు. DVK, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. ఈ సీజన్లో 3 జిల్లాల్లో 21 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి.

Similar News

News December 13, 2025

చిన్నకాపర్తిలో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ జరగలేదు: కలెక్టర్

image

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డ్రైనేజీలో ఓట్లు దొరికిన ఘటనపై ఎలాంటి బోగస్ ఓటింగ్ లేదా రిగ్గింగ్ జరగలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లు బయటపడగానే ఆర్డీఓ అశోక్ రెడ్డిని పంపి విచారణ జరిపించామన్నారు. పోలైన ఓట్లు, కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లు, డ్రైనేజీలో దొరికిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయని కలెక్టర్ తెలిపారు.

News December 13, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాలీలు, గుంపులపై నిషేధం: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడకూడదని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. జిల్లాలో BNSS 163 అమలులో ఉన్నందున, విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా, డీజేల ఏర్పాటుకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

News December 13, 2025

పోలింగ్, కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

నల్గొండ: రేపు (ఆదివారం) జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆమె అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.