News October 8, 2025
NLG: పత్తి కొనుగోళ్లకు సమాయత్తం

పత్తి కొనుగోళ్లకు నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఇప్పటికే సీసీఐ, మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిన్నింగ్ వ్యాపారులు, CCI మధ్య నిబంధనలపై ఒప్పందం కుదరడంతో సంక్షోభం తొలగిపోయింది. జిల్లాలో ఈ సీజన్లో 5.64 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగైంది.
Similar News
News October 8, 2025
నామినేషన్ల దాఖలులో ‘కోడ్’ పాటించాలి: నల్గొండ ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ఊరేగింపు కార్యక్రమాలకు అభ్యర్థులు ముందుగా పోలీసు శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పీ కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 8, 2025
NLG: ఎంపీడీఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

నల్గొండ జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధమైందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం నుంచి అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, ఎన్నికల కోడ్, 100 మీటర్ల పరిధి నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 8, 2025
స్థానిక ఎన్నికలకు నల్గొండలో సర్వం సిద్ధం

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9న మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం HYD నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీసీలో ఆమె ఈ విషయాన్ని తెలియజేశారు.