News August 28, 2025
NLG: పదవుల పందేరం.. చిగురిస్తున్న ఆశలు..!

అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరానికి తెరలేచింది. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు మునుపు జెండా మోసిన వారంతా ఆశలు పెట్టుకున్నారు. కాగా గణేష్ నిమజ్జనం జరిగే లోపు నామినేటెడ్ పదవులు భర్తీ పూర్తి చేయాలని నిర్ణయించడంతో నేతల్లో మళ్లీ ఆశలు పుట్టుకొస్తున్నాయి.
Similar News
News August 28, 2025
జాతీయ క్రీడా దినోత్సవ రన్‌ను ప్రారంభించిన కలెక్టర్

క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకొని రాణించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి కలెక్టర్ నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
News August 28, 2025
పాఠశాలల బలోపేతానికి చర్యలు: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం తన కార్యాలయంలో డీఈవో బిక్షపతి, జిల్లా సెక్టోరియల్ అధికారులు, ఎంఈవోలతో ఆమె విద్యా విషయక సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న పుస్తకాలు, యూనిఫాంలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై ఆమె సమీక్షించారు. విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News August 28, 2025
సురక్ష బీమా యోజన నమోదు చేయించాలి: శేఖర్ రెడ్డి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరినీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై)లో నమోదు చేయించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి ఆదేశించారు. ఉపాధి సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద నమోదైన వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.