News September 3, 2025
NLG: పల్లె ఓటర్లు @ 10,73,506

నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల సంఖ్య పది లక్షలు దాటింది. మంగళవారం విడుదల చేసిన పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో 10,73,506 ఓటర్లు ఉన్నట్లు తేలింది. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో 9,30,205 ఓటర్లు ఉండగా, ప్రస్తుత జాబితాలో 1,43,301 మంది ఓటర్లు పెరిగారు. ఈ జాబితాతోనే త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమవుతోంది.
Similar News
News September 3, 2025
NLG: పంట నష్టం పై సర్వే..!

జిల్లాలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టంపై అధికారులు సర్వే మొదలు పెట్టనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరి, పత్తి పంటలకు సంబంధించి 284 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నష్టం అంచనాలు తయారు చేసి నివేదికలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇవాల్టి నుంచి వారం పాటు జిల్లా వ్యాప్తంగా అధికారులు సర్వే నిర్వహించనున్నారు.
News September 3, 2025
NLG: పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,42,589 మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషుల సంఖ్య 5,30,860. దీంతో పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,729 మంది అధికంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 869కి చేరింది.
News September 3, 2025
జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్రం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒకేసారి రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ పొందుతున్నప్పటికీ, ఈ పథకానికి అర్హులేనని అన్నారు. దరఖాస్తులన్నింటినీ విచారణ చేసి త్వరితగతిన ఆర్డీఓకు పంపించాలని అధికారులను ఆదేశించారు.