News April 4, 2025

NLG: పారితోషికం కోసం ఎదురుచూపు

image

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే వివరాలను ఆన్‌లైన్లో పొందుపర్చిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు నేటికీ పారితోషికం అందలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 3000 మందికి పైగానే డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారికి పారితో కింద ఒక్కో ఫామ్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినందుకు రూ.25 ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ నేటి వరకు పారితోషికం అందించలేదని ఆపరేటర్లు తెలిపారు.

Similar News

News February 28, 2026

నల్గొండ: సీఎంఆర్‌ అక్రమాల్లో లీకుల కలకలం!

image

జిల్లాలో సీఎంఆర్‌ అక్రమాల కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల రాకపై ముందస్తు సమాచారం అందడంతో మిల్లర్లు ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేసి పరారయ్యారు. కేసులు నమోదైన మరుసటి రోజే ఎఫ్‌ఐఆర్‌ కాపీలు నిందితులకు చేరడం, వారు వెంటనే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాఖా పరమైన లీకులపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

News February 28, 2026

నల్గొండ: పంచాయతీ నిధులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

image

15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై కలెక్టర్ కార్యాలయం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. నిధుల దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని ఆదేశించింది. బేసిక్ గ్రాంట్లను 29 రకాల అభివృద్ధి పనులకు (జీతాలు మినహా) వాడవచ్చని తెలిపింది. టైడ్ గ్రాంట్లలో 50% పారిశుధ్యానికి, 50% తాగునీటి సరఫరాకు కేటాయించాలని పేర్కొంది. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రాధాన్యత క్రమంలో మార్చి 5, 2026 లోపు చెల్లించాలన్నారు.

News February 28, 2026

నల్గొండ: పంచాయతీల్లో ‘ఫైనాన్స్’ సెగ!

image

జిల్లాలోని GPలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైన నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు, కార్యదర్శుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 2 విడతలుగా జిల్లాకు సుమారు రూ.33.25 కోట్ల గ్రాంట్లు మంజూరవగా, ఆ నిధుల ఖర్చు విషయంలో ఇరువర్గాల మధ్య మనస్పర్థలు తీవ్రమవుతున్నాయి. గతంలో చేసిన పనులకు సంబంధించి కొందరు తక్కువ ఖర్చు చేసి, ఇప్పుడు రికార్డుల్లో ఎక్కువ మొత్తంలో ఖర్చులు చూపిస్తున్నట్లు తెలుస్తుంది.