News February 1, 2026

NLG: పెన్షన్ కోసం టెన్షన్..

image

ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో జాప్యం చేయడంతో జిల్లాలోని వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అన్ని రకాల పెన్షన్లు కలిపి సుమారు 2.04 లక్షలు ఉండగా, వీటి పంపిణీకి నెలకు సుమారు రూ. 47.34 కోట్ల నిధులు అవసరం అవుతున్నాయి. ప్రస్తుతం డిసెంబర్, జనవరికి సంబంధించిన పెన్షన్లు ఇంకా పంపిణీ కాకపోవడంతో పెన్షన్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు, నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 10, 2026

పాత నేరస్థులపై బైండోవర్ కేసులు: నల్గొండ ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇప్పటికే 333 మంది రౌడీషీటర్లు, పాత నేరస్థులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా చేరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం, నగదు పంపిణీపై నిఘా ఉంచామని జిల్లా ఎస్పీ తెలిపారు.

News February 10, 2026

నల్గొండ: పార్టీ అభ్యర్థులకు రెబల్స్ సవాల్..!

image

ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన ఆయా పార్టీల నేతలు రెబల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. నల్గొండ కార్పొరేషన్‌తోపాటు MLG, DVK, హాలియా, చండూరు, చిట్యాల, నందికొండ మున్సిపాలిటీల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించారు. కొందరు గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తుండగా మరికొందరు గెలుపోవటములను ప్రభావితం చేస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

News February 10, 2026

ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి: నల్గొండ ఎస్పీ

image

జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఎస్పీ పర్యవేక్షణలో ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి 1,097 మంది, 5 ప్లాటున్ల టీజీఎస్పీ పోలీస్ సిబ్బందిని నియమించారు.