News December 12, 2024
NLG: పెన్షన్ లబ్ధిదారుల్లో నిరాశ

పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు లక్ష మందికి పైగానే పెన్షన్లు అందుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు పెన్షన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పింఛన్ల పెంపుపై మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో పెంపు ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News September 16, 2025
రేపు నల్గొండలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

నల్గొండలో పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ దినోత్సవాల సందర్భంగా ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
News September 16, 2025
NLG: అమ్మకానికి ‘దొడ్డు’ బియ్యం

నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఈ వేలం ద్వారా అమ్మకం చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,927 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం బియ్యాన్ని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కిలోకు రూ.24 చొప్పున ఈ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
News September 15, 2025
ఏడాదిలో 19 మందిపై పోక్సో కేసులో శిక్ష: నల్గొండ ఎస్పీ

గడిచిన సంవత్సరంలో నల్గొండ జిల్లాలో పోక్సో చట్టం కింద 18 కేసులలో 19 మంది నిందితులకు శిక్ష పడిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కేసులలో సకాలంలో సాక్ష్యాధారాలు సేకరించి, ఛార్జిషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.