News October 1, 2024
NLG: పోలీసుల కనుసన్నల్లోనే కేటీఆర్‌పై దాడి: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల భాదితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్‌పై దాడి హేయమైన చర్య అన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం దాడి జరిగింది అని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ను ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు అని తెలిపారు.
Similar News
News November 9, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

→ నల్గొండ : హైవే విస్తరణ… అభివృద్ధికి కొత్త మార్గం
→ నల్గొండ : కూరగాయలు కొనేటట్లు లేదు..!
→ నల్గొండ : ఇక్కడి నాయకులంతా అక్కడే…!
→ చిట్యాల : గాంధీ గుడిలో అక్షయపాత్ర గురించి తెలుసా?
→ నల్గొండ : బోగస్ ఓట్లకు చెక్
→ నేరేడుచర్ల : గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం
→ నార్కట్ పల్లి : చెర్వుగట్టుకి పోటెత్తిన భక్తులు
News November 9, 2025
NLG: చేతిలో పైసల్లేవ్.. కష్టంగా కుటుంబ పోషణ!

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న తమకు వేతనాలు సకాలంలో అందడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. ఏజెన్సీల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నామన్నారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. ఆస్పత్రి అధికారులు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారన్నారు. జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. చేతిలో పైసల్లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు.
News November 9, 2025
NLG: ఇటు పంట నష్టం… అటు ఆర్థిక భారం!

జిల్లాలో కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పత్తి సేకరణకు కూలీలు దొరకడం లేదు. వరి కోతలు, పత్తి ఏరడం ఏకకాలంలో మొదలయ్యాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా వరి చేలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో నేలకొరిగిన వరి మొలకెత్తాయి. ఉన్న పంటను కోయడానికి కూలీలు, వరి కోత మిషన్లు దొరికినా వరి కోయడానికి అధిక సమయం పడుతుండటంతో ఆర్థిక భారంతో రైతులు సతమతమవుతున్నారు.


