News December 27, 2025
NLG: ప్రభుత్వ కీలక పథకాలు నల్గొండ నుంచే

కాలచక్రం గిర్రున తిరిగింది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. మరో 4 రోజుల్లో 2025కి గుడ్ బై చెప్పి 2026కు వెల్కమ్ చెప్పేందుకు అంతా రెడీగా ఉన్నారు. 2025లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాలు నల్గొండ జిల్లా నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. MLA కోటా MLC ఎన్నికల్లో జిల్లా మూలాలు ఉన్న నలుగురికి ఛాన్స్ దక్కింది.
Similar News
News January 10, 2026
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై <<18797338>>దాడులు<<>> కొనసాగుతూనే ఉన్నాయి. 20రోజుల వ్యవధిలో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునంగంజ్ జిల్లా భంగదొహోర్‌లో ఈ దారుణం జరిగింది. తమ కుమారుడిని కొందరు విచక్షణారహితంగా కొట్టారని, ఆ తర్వాత అమిరుల్ ఇస్లామ్ అనే వ్యక్తి విషమిచ్చాడని కుటుంబం ఆరోపిస్తోంది. గురువారం ఈ దాడి జరగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు చనిపోయాడు. మృతుడు జై మహాపాత్రగా గుర్తించారు.
News January 10, 2026
పట్టిసీమలో కోడిపందేల బరులు ధ్వంసం

సంక్రాంతి పండుగ వేళ కోడిపందేలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం నిఘా పెంచింది. శనివారం ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో పట్టిసీమలో కోడిపందేల బరులను ధ్వంసం చేశారు. పండుగ ముసుగులో జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు అతిక్రమించకూడదని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు.
News January 10, 2026
నన్ను ఎంపిక చేయకపోవడాన్ని స్వాగతిస్తున్నా: గిల్

T20 WCకు తనను ఎంపిక చేయకపోవడంపై భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ గిల్ తొలిసారి స్పందించారు. సెలక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే WC జట్టుకు విషెస్ తెలిపారు. దేశం తరఫున ఆడుతున్న ప్రతి ప్లేయర్ తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారని, అయితే జట్టును ఎంపిక చేసే నిర్ణయం సెలక్టర్లదే అన్నారు. తాను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నానని, తన డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.


