News September 21, 2025

NLG: ప్రభుత్వ హాస్పిటల్ సెక్షన్ క్లర్క్ సస్పెండ్

image

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సెక్షన్ క్లర్క్ భార్గవ్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నారు. వేతనాలు సకాలంలో అందడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు కలెక్టర్‌కు నివేదించారు. తన వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు మళ్లించాడని ఆయనపై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి.

Similar News

News September 21, 2025

రేపు నంద్యాల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

నంద్యాల జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి గణియా తెలిపారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడిచారు. ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా ‘meekosam.ap.gov.in’లో ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు.

News September 21, 2025

HYD: ఉస్మానియా ఆసుపత్రి హెల్ప్ లైన్ నంబర్ ఇదే..!

image

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు, ఎమర్జెన్సీ సేవలు తెలుసుకోవడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శస్త్రచికిత్సలు, వైద్యం కోసం వస్తున్న వారికి ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. 7780288622 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సమాచారం.