News March 25, 2025

NLG: ప్రాణం తీసిన ఈత సరదా

image

నల్గొండ జిల్లా దండెంపల్లి<<15883784>> SLBC కాలువలో<<>> ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగార్జున డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి పోతుగంటి ఉదయ్ కుమార్ మృతి చెందాడు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు సూర్యాపేట జిల్లా నాగారం వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 6, 2025

నల్గొండ: దూడకు రెండే కాళ్లు..!

image

తిప్పర్తి మండలం పజ్జూరులో రైతు జంజీరాల గోపాల్‌కు చెందిన గేదె రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది. దూడకు కేవలం ముందు కాళ్లు మాత్రమే ఉన్నాయని, వెనుక కాళ్లు లేవని రైతు తెలిపారు. దూడ ఆరోగ్యంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.

News November 6, 2025

మిర్యాలగూడ: 100 గొర్రెలు మృతి

image

100 గొర్రెలు ఆకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వేములపల్లి మండలంలో జరిగింది. పెన్ పహాడ్ మండలానికి చెందిన గొర్ల కాపర్లు సైదులు, నాగరాజు, కోటయ్య, శ్రీరాములు, ఉపేందర్ మరో ఇద్దరు కలిసి గొర్లను మేపుకుంటూ నాలుగు రోజుల క్రితం వేములపల్లి శివారుకు చేరుకున్నారు. అక్కడే మేపుతుండగా ఒకేసారి గొర్లు చనిపోయాయని కాపర్లు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News November 6, 2025

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

నల్గొండ మండలం చర్లపల్లిలోని హాకా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీల కొరత లేకుండా సకాలంలో వాటిని వెంటవెంటనే పంపించాలని పేర్కొన్నారు.