News July 21, 2024

NLG: ఫిర్యాదుల విభాగాలు ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్

image

రుణమాఫీకి సంబంధించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకుగాను ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వివిధ అంశాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News August 20, 2025

జిల్లాలో యూరియాకు కొరత లేదు: కలెక్టర్ ఇలా

image

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని ఆమె వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.

News August 20, 2025

NLG: నల్గొండ జిల్లాలో 45% అధిక వర్షం

image

జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు సాధారణం కంటే 45 శాతం అధిక వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో 20 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జులై చివరి వరకు జిల్లాలో లోటు వర్షపాతం నమోదవగా.. ఆగస్టు తొలి వారం నుంచి జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసి అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు 399 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News August 20, 2025

NLG: బియ్యంతో పాటు ఇక సంచులు

image

నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇకపై బియ్యంతో పాటు పర్యావరణహిత సంచులను అందించనుంది. జిల్లాలోని 4.66 లక్షల కార్డులకు ఈ సంచులను పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ నెల బియ్యం కోటాతో పాటు వీటిని లబ్ధిదారులకు అందజేస్తారు. కార్డుల వారీగా సంచులను ఎమ్‌ఎల్‌ఎస్ పాయింట్లకు సరఫరా చేశారు. ఈ బ్యాగుల్లోనే బియ్యం తీసుకెళ్లేలా నాణ్యమైన సంచులను తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.