News August 18, 2025
NLG: బత్తాయి ధర ఢమాల్

నల్గొండ జిల్లా బత్తాయి రైతులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే తోటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతుండగా, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మార్కెట్ మాయాజాలం మరింత కుంగదీస్తోంది. బత్తాయి రేటు ఇటీవల ఎన్నడూ లేనంతగా పడిపోయింది. తోటల వద్ద టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు మించి పలకడం లేదు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర పెంచడానికి ససేమిరా అంటున్నారని రైతులు వాపోతున్నారు.
Similar News
News August 20, 2025
ఢిల్లీ సీఎంపై దాడికి కారణమిదేనా?

ఢిల్లీ CM రేఖా గుప్తాపై రాజేశ్ <<17460103>>దాడికి<<>> పాల్పడిన సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన నిందితుడు శునక ప్రేమికుడని, సుప్రీంకోర్టు <<17368812>>తీర్పుతో<<>> కలత చెంది ఢిల్లీకి వెళ్లాడని అతడి తల్లి పేర్కొంది. ఇదే విషయమై CMను ప్రశ్నించేందుకు వెళ్లి దాడి చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిది హింసా ప్రవృత్తి అని, మానసిక పరిస్థితి బాగాలేదని అతడి తల్లి తెలిపారు. తనతో సహా పొరుగువారినీ కొట్టేవాడని వివరించారు.
News August 20, 2025
తిరుపతి: ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

తిరుపతి విమానాశ్రయ రోడ్డులోని IIDT భవనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. దీనిని సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. విద్యార్థులు, స్టార్టప్స్, వ్యాపారవేత్తలకు నూతన అవకాశాలు కలిగించేందుకు ఈ హబ్ దోహదపడుతుందని చెప్పారు.
News August 20, 2025
ఆర్గనైజేషన్ సెక్రటరీగా జగిత్యాల జిల్లా వాసులు

తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జగిత్యాల జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మోతె ఉమాకాంత్, కార్యదర్శిగా మునుగోటి రమేష్ శర్మలను నియమిస్తూ తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ మంగళవారం DSR గార్డెన్, హన్మకొండలో ధ్రువీకరణ పత్రం అందజేశారు. వీరి నియామకం పట్ల రాయికల్, జగిత్యాల బ్రాహ్మణ సంఘం సభ్యులు, తెలుగు పండితులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.