News January 5, 2026

NLG: బ్యాలెట్‌ వైపే మొగ్గు!

image

మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనప్రాయంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే 2014లో ఈవీఎంలతో, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ప్రభుత్వం బ్యాలెట్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Similar News

News February 11, 2026

ఖమ్మం కలెక్టరేట్ నుంచి పోలింగ్ పర్యవేక్షణ

image

ఖమ్మంలోని ఐదు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ బుధవారం కలెక్టరేట్ నుంచి పర్యవేక్షించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా 117 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సరళిని ఐదు ప్రత్యేక స్క్రీన్లపై పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా వెబ్ క్యాస్టింగ్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

News February 11, 2026

RR: GREAT ఓటేసిన 103 ఏళ్ల రామయ్య

image

మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 103 ఏళ్ల రామయ్య తన ఓటు హక్కును వినియోగించుకుని యువకులకు ఆదర్శంగా నిలిచారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌కి చెందిన రామయ్య అదే వార్డులోని పోలింగ్ కేంద్రానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వీల్ ఛైర్‌పై వచ్చి తన వార్డుకు చెందిన తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. ఓటు విలువ ఇప్పటికైన కొందరు తెలుసుకోవాలని సూచించారు.

News February 11, 2026

తిరుమలగిరిలో భారీగా ఓటింగ్

image

సూర్యాపేట జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 48వ వార్డులో వృద్ధులు ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి జిల్లాలో అత్యధికంగా తిరుమలగిరిలో 79.34 శాతం పోలింగ్ నమోదు కాగా, సూర్యాపేటలో 64.39 శాతం ఓట్లు పోలయ్యాయి. ముసలి వయసులోనూ కర్ర పట్టుకుని, చక్రాల కుర్చీల్లో వచ్చి ఓటు వేసిన అవ్వాతాతలు యువతకు స్ఫూర్తిగా నిలిచారు.