News August 13, 2025

NLG: భారీ వర్షాలు.. అధికారులతో CM వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 72 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 14, 2025

‘స్వాతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి’

image

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ జిల్లా అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై బుధవారం ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 15న ఉదయం 9:30 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారని తెలిపారు.

News August 13, 2025

మాదక ద్రవ్యాల రహిత సమాజానికి కృషి: నల్గొండ SP

image

మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో మాదక ద్రవ్యాల మాయలో పడితే జీవితం వృథా అవుతుందని తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.

News August 13, 2025

నల్గొండ: పోక్సో నిందితుడికి జీవిత ఖైదు

image

నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో నిందితుడు గ్యారాల శివకుమార్‌కి జీవిత ఖైదీ విధిస్తూ బుధవారం మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. 2023లో మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారం చేశాడనే ఆరోపణపై శివకుమార్‌పై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది.