News March 16, 2025

NLG: మండలానికి మరో రెండు రైతు నేస్తం కేంద్రాలు!

image

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా రైతు నేస్తం కేంద్రాలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి NLG జిల్లాలో 315 రైతు వేదికల్లో 77 రైతు నేస్తం కేంద్రాలని నిర్వహిస్తోంది. మండలానికి మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రతినెల నిధులు మంజూరు చేసి రైతులకు మరింత పరిజ్ఞానం అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News October 28, 2025

కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్

image

నల్గొండ జిల్లాలో కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజాతో మాట్లాడి వెంటనే పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పిల్లల అమ్మకాలపై, అక్రమ దత్తతపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

News October 28, 2025

నల్గొండ: పిచ్చికుక్క బీభత్సం.. ఏడుగురికి గాయాలు

image

నల్గొండ నాలుగో వార్డు, కేశరాజుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ పిచ్చికుక్క దాడిలో ఏడుగురు గాయపడ్డారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, రోడ్డుపై వెళ్లే బైకర్లను కూడా వెంటాడి గాయపరుస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఆ పిచ్చికుక్కను పట్టుకోవాలని వారు కోరుతున్నారు.

News October 28, 2025

NLG: శిశు విక్రయ ఘటనపై సీరియస్… కేసు నమోదు

image

నల్గొండ జిల్లాలో శిశు విక్రయం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. శిశువును అమ్మిన తల్లిదండ్రులు బాబు, పార్వతితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్య దళారులుగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేయాలని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.