News March 28, 2025
NLG: మధ్యాహ్నం వేళ.. రోడ్లన్నీ ఖాళీ..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి కూలీలు, కార్మికులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Similar News
News February 26, 2026
నల్గొండ: ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్.. దరఖాస్తుల ఆహ్వానం

టీజీఎస్ఆర్టీసీ నల్గొండ రీజియన్ పరిధిలోని వివిధ డిపోల్లో అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ కె. జానిరెడ్డి తెలిపారు. 2022 నుంచి 2025 మధ్య ఇంజనీరింగ్ లేదా డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు nats.education.gov.in వెబ్‌సైట్ ద్వారా మార్చి 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 26, 2026
NLG: ఇంటర్ పరీక్షలు.. రెండో రోజు 286 మంది డుమ్మా..!

జిల్లాలో రెండో రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 286 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,480 మంది విద్యార్థులకు గాను 11,265 మంది హాజరుకాగా, 215 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,637 మంది విద్యార్థులకు గాను 1,566 మంది హాజరుకాగా, 71 మంది గైర్హాజరయ్యారు.
News February 26, 2026
నల్గొండ: మద్యపాన నిషేధ అమలుకు తీర్మానం

నార్కట్‌పల్లి మండలం షాపల్లి, అమ్మనబోలు గ్రామాలు బెల్ట్ షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. షాపల్లిలో ఈ నెల 26 నుంచి, అమ్మనబోలులో మార్చి 1 నుంచి బెల్టు దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు చేపడతామని పాలకమండలి తీర్మానం చేసింది. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర పల్లెలు స్వాగతిస్తున్నాయి. ఈ సామాజిక మార్పు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


