News April 16, 2025
NLG: మరోసారి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ 17 నుంచి 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. తదుపరి నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అంతకుముందు ఏప్రిల్ 11, 15, 16న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే.
Similar News
News November 13, 2025
నిర్మల్ జిల్లాలో ఢీ అంటే ఢీ.. ఛాన్స్ ఎవరికి?

డీసీసీ పదవి కోసం నేతలు భారీగా అశలు పెట్టుకున్నారు. ఈ నేతల్లో లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
నిర్మల్ జిల్లాలో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్, ఖానాపూర్కు చెందిన దయానంద్, భైంసా ఏఎంసీ ఛైర్మన్ ఆనంద్ రావు పటేల్ పేర్లు ప్రధానంగా డీసీసీ రేసులో వినిపిస్తున్నాయి. శ్రీహరి రావునే మళ్లీ కొనసాగించేలా పార్టీ పరిశీలిస్తోందని టాక్.
News November 13, 2025
వేములవాడ: ID కార్డులుంటేనే అనుమతి

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్న క్రమంలో ప్రధాన ఆలయ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. గురువారం నుంచి ప్రధాన ఆలయం పరిసరాల్లోకి గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే అనుమతించడానికి ఆలయ యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ అధికారులు గుర్తింపు కార్డుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
News November 13, 2025
ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి దాడి చేశారు: FRO

చందంపేట మండలం గువ్వలగుట్ట తండాలో నిన్న జరిగిన దాడిపై ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. అటవీ భూమిలో సాగు చేస్తున్న గిరిజనులను హక్కు పత్రాలు చూపాలని కోరామన్నారు. కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని వాగ్వాదానికి దిగి ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి రాళ్ళు, కర్రలతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు.


