News March 23, 2025
NLG: మహిళా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

మహిళా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను మహిళా రైతులకు రాయితీపై అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 13 రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు కోటి 81 లక్షల 36 వేల నిధులను కేటాయించడంతో పాటు 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే మహిళల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు.
Similar News
News March 25, 2025
నల్గొండ: మరొకరికి మంత్రి పదవి!

మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. ఇటీవల అద్దంకి దయాకర్‌ను MLC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SRPTకి చెందిన రమేశ్ రెడ్డిని పర్యాటక శాఖ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు. దీంతో ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యం పెరిగినట్లైంది. జిల్లాకు మరో అమాత్య యోగముందా కామెంట్ చేయండి.
News March 25, 2025
ఉమ్మడి NLG జిల్లా నుంచే సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతున్నాయి. ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభ ప్రాంగణం ఏర్పాటు చేయనున్నారు.
News March 25, 2025
NLG: ఉద్యమాల జిల్లాలో ‘పోరుబాట’

ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి సాగుకు నీరు అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. ఎండిన పంట చేలలో రైతులు పశువులను మేపుతున్నారు. దీంతో ఇటు BJP, BRS, CPM పార్టీలు ఉద్యమ బాట పట్టారు. ఎండుతున్న పంటల విషయంపై అధికార పార్టీ సైలెంట్‌గా ఉండగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం పోరుబాట కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండిన పొలాలను పరిశీలిస్తూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.