News September 13, 2025

NLG: మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలు!

image

ఉమ్మడి NLG జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు నల్గొండ DCCB గుడ్ న్యూస్ చెప్పింది. వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనుంది. ఇప్పటివరకు మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు 11.5 శాతం నుంచి 12 శాతం వరకు ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ వేస్తున్నాయి. అయితే మొదటిసారిగా డీసీసీబీ ఆయా సంఘాలకు 7 శాతం 10 శాతంలోపు వడ్డీకి రుణాలు అందించనుంది. కాగా జిల్లాలో 1,255 మహిళా సంఘాలున్నాయి.

Similar News

News September 13, 2025

బెల్లంపల్లి: ఎన్‌కౌంటర్‌లో మావో వెంకటి మృతి

image

బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన మావోయిస్టు నాయకుడు జాడి వెంకటి ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ అటవీ ప్రాంతంలో గురువారం ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 1996లో అజ్ఞాతంలోకి వెళ్లిన వెంకటి, పార్టీలో కీలక పాత్ర పోషించారు. జాడి పోచమ్మ-ఆశయ దంపతులకు ఒక్క కుమారుడు కావడంతో కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. తహశీల్దార్‌ కార్యాలయంలో సుంకరిగా పనిచేస్తూ మావో కొరియర్‌గా పనిచేశాడని స్థానికులు తెలిపారు.

News September 13, 2025

గాంధీలో ఉత్తమ సేవలకు సహకారం: జూడాలు

image

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌ డాక్టర్ ఎన్.వాణిని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడా) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆసుపత్రి సేవల మెరుగుదలకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే జూనియర్ వైద్యుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో జూడా అధ్యక్షుడు డా.అజయ్‌కుమార్ గౌడ్ సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 13, 2025

కామారెడ్డి జిల్లాలో వర్షపాతం వివరాలు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. బొమ్మన్‌దేవిపల్లి 39.8 మి.మీ., నస్రుల్లాబాద్ 29.5, పుల్కల్ 14.8, పిట్లం, బీర్కూర్‌ 14, డోంగ్లి 12.5, కొల్లూరు 11.5, ఇసాయిపేట 10.8, రామారెడ్డి 10, మేనూరు 9.5, పెద్ద కొడప్గల్ 9, బిచ్కుంద 6.5, పాత రాజంపేట 5.5, IDOC(కామారెడ్డి) 5.3, సర్వాపూర్ 4.8, మాక్దూంపూర్ 3.5, జుక్కల్ 3.3, వెల్పుగొండ 2.8 మి.మీ. వర్షం పడింది.