News April 14, 2025

NLG: మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నల్గొండ వాసి!

image

నల్లగొండ వాసికి అత్యున్నత పదవి లభించింది. హైకోర్ట్ న్యాయమూర్తిగా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్‌ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. NLGకి చెందిన ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.

Similar News

News April 15, 2025

SRPT: కొడుకుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

image

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. చిలుకూరు మండలం కొత్తకొండాపురంలో బావిలో దూకి తల్లి వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందగా.. తమ బాగోగులు చూసేవారు లేరని మనస్తాపం చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

News April 15, 2025

పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

image

సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్‌పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.

News April 15, 2025

చీకోటి ప్రవీణ్‌పై నల్గొండలో కేసు నమోదు

image

బీజేపీ నేత చీకోటి ప్రవీణ్‌ కుమార్‌పై నల్గొండ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నల్గొండలో జరిగిన హనుమాన్‌ శోభాయాత్రలో పాల్గొన్న చీకోటి ప్రవీణ్‌ కుమార్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులొచ్చాయి. దీంతో అతనిపై 188, 153 సెక్షన్ల కింద నల్గొండ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

error: Content is protected !!