News March 27, 2024

NLG: మార్చిలోనే మండుతున్న ఎండ!

image

వేసవి భగభగలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఉదయం 7 నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఏడు వరకు తగ్గడం లేదు. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం కలవరపరుస్తోంది. ఉమ్మడి జిల్లాలో గత ఐదు రోజుల నుంచి ఉష్ణోగ్రత తీవ్రత పెరిగింది. మరో అయిదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగించే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

Similar News

News September 8, 2025

నేడు గ్రీవెన్స్ డే రద్దు: ఎస్పీ

image

నేడు (సోమవారం) నిర్వహించాల్సిన గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆయన అందుబాటులో ఉండని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని తెలిపారు.

News September 7, 2025

రేపటి నుంచి నల్గొండలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్..!

image

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 8 నుంచి NLG పట్టణంలోని మైసయ్య విగ్రహం సమీపంలో అన్నపూర్ణ క్యాంటీన్ ఆవరణలో మెప్మా, పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. మెప్మా ద్వారా ఉపాధి పొందుతున్న మహిళల ఆధ్వర్యంలో వివిధ రకాల వంటల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

News September 7, 2025

NLG: మాతృ సంస్థలోకి మళ్లీ..!

image

వీఆర్ఏలు, వీఆర్వోలు తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చారు. ప్రభుత్వం వారిని గ్రామ పాలనాధికారులుగా కొత్తగా నియమించింది. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కౌన్సిలింగ్ నిర్వహించి క్లస్టర్లను కేటాయించారు. జిల్లాలో 275 క్లస్టర్లు ఉంటే 276 మంది జీపీవోలుగా ఎంపిక చేసింది. సీసీఎల్ఏ నిబంధనల ప్రకారం జీపీఏలకు వారి ర్యాంకులను బట్టి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.