News January 1, 2026

NLG: మున్సిపల్ ఎన్నికలు.. ఆ రోజు తుది ఓటర్ జాబితా!

image

ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈనెల 5వ తేదీన నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో జనవరి 6వ తేదీన ఆయా పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు తీసుకుని అవసరమైతే మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. జనవరి 10న మున్సిపల్ తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.

Similar News

News February 20, 2026

‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!

image

డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘PhonePe’ ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాప్ గురించి సరిగ్గా అవగాహన లేనివాళ్లు కూడా ఈజీగా వినియోగించేలా AI-ఆధారిత సెర్చ్ ఫీచర్‌ను ప్రారంభించింది. దీనిద్వారా యూజర్లు టెక్స్ట్ లేదా వాయిస్ కమాండ్లతో పేమెంట్స్, రీఛార్జ్ వంటివి చేయొచ్చు. ఉదాహరణకు ‘FASTag రీఛార్జ్’ అని టైప్ చేస్తే నేరుగా ఆ పేజీకి తీసుకెళ్తుంది. ఇది డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది. SHARE IT.

News February 20, 2026

నిర్మల్: ‘సకాలంలో పన్నులు చెల్లించాలి’

image

నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను (Property Tax) బకాయిలు పేరుకుపోయాయని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. వెంటనే వసూలు చేసేందుకు సోమవారం నుంచి నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. పన్నులు చెల్లించని వారికి నోటీసులు అందించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News February 20, 2026

భద్రాద్రి జిల్లాకు తేలికపాటి వర్ష సూచన

image

ఈనెల 22వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొడి వాతావరణ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 23 నుంచి 25వ తేదీల్లో జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రత 34°C నుంచి 36°C ఉంటుందని తెలిపారు. చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంట తడవకుండా టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.