News January 29, 2025

NLG: మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా!

image

NLG జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలానికి తెరపడిన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో ఆరు నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా మున్సిపాలిటీలలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News February 21, 2026

నల్గొండ: నేతన్నలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

2026 జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నారు. 30 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల అనుభవం ఉన్న చేనేత కళాకారులు; 25 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. ఆసక్తి గలవారు మార్చి 31, 2026 లోపు జిల్లా చేనేత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

News February 21, 2026

NLG: మరో వారం రోజులే గడువు

image

ఫార్మర్ రిజిస్ట్రీకి మరోవారం రోజులే గడువు మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు 2,41,039 మంది రైతులు మాత్రమే ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

News February 21, 2026

నల్గొండ: ఆందోళన కలిగిస్తున్న మరణాలు

image

నల్గొండ జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఆందోళన కలిగిస్తున్నాయి. మామిడాలలో అప్పుల బాధతో సంతోశ్ ఉరివేసుకోగా, తెట్టకుంటలో మానసికస్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేశ్ గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.