News January 27, 2025

NLG: మున్సిపల్ పగ్గాలు అదనపు కలెక్టర్లకే!

image

NLG జిల్లాలోని మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఆదివారంతో ముగిసింది. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు అదనపు కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులుగా కొనసాగనున్నారు. కాగా నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఉండటంతో యథావిధిగా కొనసాగనుంది.

Similar News

News November 3, 2025

పోలీస్ గ్రీవెన్స్‌లో 45 ఫిర్యాదులు

image

పోలీస్ గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 45 మంది అర్జీదారులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని, తక్షణమే సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

News November 3, 2025

చిట్యాల అండర్‌పాస్ వద్ద సమస్య పరిష్కారానికి ఎస్పీ పర్యవేక్షణ

image

జాతీయ రహదారి 65 పై చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిలిచి తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.

News November 3, 2025

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్‌

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.