News December 16, 2025
NLG: మూడో విడతలో మద్యం మాయ..!

ఈనెల 17న నిర్వహించనున్న మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. బుధవారం పోలింగ్ జరగనుండగా, అనేక గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, చికెన్ పంపిణీ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేయగా, మరికొన్ని గ్రామాల్లో ఇంటింటికీ కిలో చికెన్, ఫుల్ బాటిల్ మందు అందజేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
Similar News
News December 18, 2025
స్థానిక పోరులో VKB.. 82.49% పోలింగ్

వికారాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 70 గ్రామ పంచాయతీలు, 546 వార్డులకు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన 524 పంచాయతీలకు, 4512 వార్డులకు ఎన్నికలు ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా 82.49% పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు చేసిన కృషి సఫలం అయ్యింది.
News December 18, 2025
సిరిసిల్ల గడ్డపై చెల్లాచెదురైన ‘గులాబీ’

KTR, BRS కంచుకోటగా పేరొందిన సిరిసిల్ల నియోజకవర్గంలో ఈసారి రాజకీయ చిత్రం తలకిందులైంది. నియోజకవర్గంలోని 5 మండల కేంద్రాల్లో కేవలం ఎల్లారెడ్డిపేటలో మాత్రమే BRS బలపరిచిన అభ్యర్థి ఎలగందుల నర్సింలు విజయం సాధించారు. తంగళ్లపల్లిలో కాంగ్రెస్ (మోర లక్ష్మీరాజం), ముస్తాబాద్‌లో BJP (మట్ట వెంకటేశ్వర్ రెడ్డి), వీర్నపల్లిలో CPM (M.జ్యోత్స్న), గంభీరావుపేటలో స్వతంత్ర అభ్యర్థి మల్లుగారి పద్మ గెలిచారు.
News December 18, 2025
NTR: అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం.. అమ్మానాన్నను కోల్పోయిన చిన్నారులు

వారం రోజుల కిందట <<18518983>>భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. వాంబేకాలనీకి చెందిన అజయ్ కుమార్‌కు గుండెపోటు రాగా, నాలుగో అంతస్తు నుంచి తీసుకురాలేమని 108 సిబ్బంది వెనుదిరిగారు. సకాలంలో వైద్యం అందక అజయ్ మృతి చెందగా, ఆ బాధతో భార్య నాగలక్ష్మి ప్రాణాలు విడిచింది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టెక్నీషియన్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు.


